పుస్తక పఠనం అలవర్చుకోవాలి — డాక్టర్ ఎం. రామకృష్ణ గౌడ్
కుంటాల, నవంబర్ 13 (మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి):
ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిర్మల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ అన్నారు. గురువారం కుంటాల మండలంలోని లింబా (కే) గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన “తెలంగాణ ఉద్యమకారులు ముధోల్ నియోజకవర్గం, పాండురంగ శతకం, గజ్జలమ్మ శతకం, బాలరామ శతకం” పుస్తక పరిచయ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత రచయిత జాదవ్ పుండలిక్ రావు పాటిల్ రచించిన తెలంగాణ ఉద్యమకారులు ముధోల్ నియోజకవర్గం మరియు బాలరామ శతకం పుస్తకాలపై సమీక్ష నిర్వహించారు. ఉద్యమకారుడు చాకేటి లక్ష్మన్న మాట్లాడుతూ — “పుస్తకాలు చదవడం వలన అపారమైన జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వలన వ్యక్తి వికాసం సాధ్యమవుతుంది,” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. పురుషోత్తం, సీనియర్ ఉపాధ్యాయులు ఏ. సతీష్, ఎల్. ప్రదీప్, ఏ. రాజేశ్వర్, కె. సంధ్యారాణి, ఎన్. భోజన్న, జె. రఘునాథ్, జె. శ్రీకాంత్, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.