శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ త్రయాహానిక ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం

శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ త్రయాహానిక ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం

హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విధ్యారణ్యభారతి స్వామిజీ గురువారం పాల్గొననున్నారు

మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్, నవంబర్ 12:

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన త్రయాహానిక మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈ సందర్భంలో హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురు విధ్యారణ్యభారతి స్వామిజీ గురువారం ఈ మహోత్సవానికి విచ్చేసి ప్రతిష్ఠా కార్యక్రమాలలో పాల్గొననున్నారని శ్రీ గురుముల చంద్రశేఖర్ వర్మ (పంతులు) తెలిపారు. మండలంలోని గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ, “ఈ మహోత్సవం ఆధ్యాత్మికంగా ప్రతి భక్తునికి పవిత్ర అనుభూతిని కలిగిస్తుంది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని కోరారు.ప్రతిష్ఠా వేడుకలు మంత్రోచ్చారణల నడుమ, వేద పండితుల ఆశీర్వాదాలతో జరగనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment