అడెల్లి మహా పోచమ్మ తల్లికి వెండి కిరీట బహుకరణ
చింతాకుల రాజేశ్వర్ గౌడ్ కుటుంబం నుంచి అమ్మవారికి ఆభరణ సమర్పణ
మనోరంజని తెలుగు టైమ్స్
సారంగాపూర్ ప్రతినిధి, నవంబర్ 09
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం అడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం వద్ద భక్తి శ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రతిష్టించబడిన అమ్మవారి విగ్రహానికి చింతాకుల రాజేశ్వర్ గౌడ్ కుటుంబ సభ్యులు — కుమార్తెలు శ్రీలత వెంకటేష్ గౌడ్, సుమలత శ్రీనివాస్, ప్రేమలత శరత్ గౌడ్ — అమ్మవారికి వెండి కిరీటాన్ని ఆలయ చైర్మన్ భోజగౌడ్, ఈ.ఓ భూమన్న సమక్షంలో సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుచరిత రాజేశ్వర్ రావు, మాజీ ఆడెల్లి చైర్మన్ ఉట్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారికి అంకితభావంతో బహుకరించిన ఈ వెండి కిరీటం భక్తుల మనసులను ఆకట్టుకుంది.