ప్రజల పక్షపాతి డాక్టర్ మధుశేఖర్ – రూ.100కే వైద్యం!

ప్రజల పక్షపాతి డాక్టర్ మధుశేఖర్ – రూ.100కే వైద్యం!

ప్రజల పక్షపాతి డాక్టర్ మధుశేఖర్ – రూ.100కే వైద్యం!

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి నవంబర్ 06

నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్:
ప్రజల ఆరోగ్యాన్ని ధ్యేయంగా పెట్టుకున్న ప్రసిద్ధ వైద్యుడు, ఎం.జె హాస్పిటల్ సుప్రీమొ డాక్టర్ బద్దం మధుశేఖర్ మరో స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తన ఆసుపత్రి ఎం.జె హాస్పిటల్, ఆర్మూర్ లో చికిత్స కోసం ₹300 కాకుండా కేవలం ₹100కే వైద్యం అందించనున్నారు. ఈ నిర్ణయాన్ని ఆయన తన 62వ జన్మదినం (నవంబర్ 3) సందర్భంగా ప్రజల కోసం బర్త్‌డే గిఫ్ట్‌గా ప్రకటించారు. అంతేకాకుండా, బీంగల్ వాసులకు ఉచిత వైద్య సేవలు అందిస్తానని కూడా తెలిపారు. డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ
“ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం అందాలి అనేది నా సంకల్పం. వంద రూపాయలకే కాకుండా ఉచితంగా సేవలు అందించాలని నా మనసుంది. కానీ, కొన్ని సానుభూతిపరుల సూచనల మేరకు చార్జ్‌ను ₹100గా నిర్ణయించాను” అని తెలిపారు. ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖరీదైపోయిన ఈ సమాజంలో డాక్టర్ మధుశేఖర్ తీసుకున్న ఈ ప్రజాహిత నిర్ణయం అందరిలోనూ ప్రశంసల వర్షం కురిపిస్తోంది.ప్రజల పక్షపాతి, విశాలహృదయుడైన డాక్టర్ మధుశేఖర్ — మానవీయ విలువలకు ప్రతీకగా నిలుస్తూ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment