బాసర గోదావరి తీరంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

బాసర గోదావరి తీరంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

బాసర గోదావరి తీరంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

ఉత్సవాలకు హాజరైన జిల్లా కలెక్టర్- ఎస్పీ

బాసర మనోరంజని ప్రతినిధి నవంబర్ 5

బాసర గోదావరి తీరంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో ప్రవహించే పవిత్ర గోదావరి నది తీరంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఉత్సవాలతో గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆలయ అర్చకులు, వైదిక బృందం గోదావరి నదికి మహా హారతి, జ్వాలాతోరణం పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, ఏఎస్పీలు అవినాష్ కుమార్, రాజేష్ మీనా హాజరయ్యారు. కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటికీటలాడింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment