వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

కన్నుల పండువగా రథోత్సవం…ఆకట్టుకున్న కుస్తీ పోటీలు

తానూర్ మనోరంజని ప్రతినిధి నవంబర్ 5

వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

మండల కేంద్రమైన తానూర్ లో కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగిన శ్రీ విఠలారుక్మాయి జాతర అంగరంగ వైభవంగా ముగిసింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విఠలేశ్వర ఆలయంతో పాటు గ్రామంలోని ప్రధాన ఆలయాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రతి రోజు కాకడ హారతితో పాటు పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

కన్నుల పండువగా రథోత్సవం…

వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

మంగళవారం రాత్రి రథోత్సవాన్ని కన్నుల పండువుగా నిర్వహించారు. రథోత్సవాన్ని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రథోత్సవంలో ముడుపులు కట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

జనసందోహంతో కళకళలాడిన జాతర…

వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

ప్రతి సంవత్సరం మాదిరిగానే కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం విఠలారుక్మాయి జాతర ఉత్సవాలను ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. జాతరను తిలకించడానికి ప్రజలు, భక్తులు భారీగా తరలి వచ్చి ఆలయంలో పూజలు నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, తినుబండారాల దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. మహిళలు, యువతులు గాజులు, ఇతర వస్తువులు కొనుగోలు చేయగా, చిన్నారులు ఆట వస్తువులు, మిఠాయిలను కొనుగోలు చేశారు. యువతీ యువకులు రంగుల రాట్నాలలో కూర్చుని కేరింతలు కొట్టారు. ఈ జాతర వైభవంగా ముగిసింది.

ప్రత్యేక ఆకర్షణగా మల్ల యోధుల కుస్తీ పోటీలు…

వైభవంగా ముగిసిన శ్రీ విఠలారుక్మాయి జాతర

ప్రతి ఏటా నిర్వహించే విధంగానే, ఈ ఏడాది కూడా ఆలయ, గ్రామ వీడీసీ కమిటీల ఆధ్వర్యంలో మల్ల యోధులకు కుస్తీ పోటీలను జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలలో పాల్గొనడానికి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల నుంచి అలాగే మహారాష్ట్రలోని ధర్మాబాద్, ఉమ్రీ, భోకర్, నాందేడ్, జాల్నా, పర్భణీ, పూణే వంటి ప్రాంతాల నుంచి కూడా మల్ల యోధులు భారీగా తరలివచ్చారు. కుస్తీ పోటీలను తిలకించడానికి పరిసర ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు. కుస్తీ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న మల్ల యోధునికి రూ, 11,111 నగదు, ఒక వెండి కడియం, ద్వితీయ బహుమతిగా రూ,8,851 నగదును ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించి అందజేశారు.

జాతరకు భారీ పోలీసు బందోబస్తు…

జాతర, కుస్తీ పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముధోల్ సీఐ జీ. మల్లేష్ ఆధ్వర్యంలో తానూర్ ఎస్సైలు షేక్ జుబేర్, హన్మాండ్లు గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. జాతర, కుస్తీ పోటీలు ప్రశాంతంగా కొనసాగి అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పంగి పండరి, ఉపాధ్యక్షుడు ధార్మోడ్ రాములు, మాజీ సర్పంచులు తాడేవార్ విఠ్ఠల్, మాధవరావు పటేల్, సొసైటీ డైరెక్టర్ పుండలిక్, ఏఎంసీ డైరెక్టర్ మౌలాఖాన్, ఆలయ కమిటీ కార్యదర్శి గోవింద్ పటేల్, మాజీ ఉపసర్పంచ్ షాన్వాజ్ ఖాన్,నయ్యుమ్ ఖాన్, నాయకులు శివాజీ రావు పటేల్, విట్టల్, పోశట్టి, సోమనాథ్, సుభాష్, గ్రామ పెద్దలు, ఆలయ, వీడీసీ కమిటీ సభ్యులు, మండల నాయకులు, గ్రామస్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment