రోడ్డు భద్రతపై వార్డు కమిటీ ఏర్పాటు మరియు అవగాహన సదస్సు.

రోడ్డు భద్రతపై వార్డు కమిటీ ఏర్పాటు మరియు అవగాహన సదస్సు.

రోడ్డు భద్రతపై వార్డు కమిటీ ఏర్పాటు మరియు అవగాహన సదస్సు.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

రోడ్డు భద్రతపై వార్డు కమిటీ ఏర్పాటు మరియు అవగాహన సదస్సు.

భీమారం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై వార్డ్ కమిటీని ఏర్పాటు చేసి, ప్రజలకు ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా భీమారం ఎస్ఐ కె. శ్వేత మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి పౌరుడి బాధ్యత, దీనిని నివారించడానికి ప్రజలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని అన్నారు. ఇటీవల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఆటో డ్రైవర్లు, వాహనదారులు కు క్రింది సూచనలు ఇవ్వడం జరిగింది. *వాహనదారుడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటూ కారులో వెళ్లేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, మోటార్ సైకిల్ పైన వెళ్లేవారు హెల్మెట్ ధరించాలని అన్నారు.
మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరమని మరియు అది క్షమించరాని నేరం అన్నారు.
రోడ్డుపై వెళ్లేటప్పుడు అతివేగంగా వెళ్లకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ఉండాలన్నారు.
త్రిబుల్ రైడింగ్ కూడా రోడ్డు ప్రమాదాలకు కారణం అని సూచిస్తూ వాహనదారుడు ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ లు కలిగి ఉండాలన్నారు.
వాహనాన్ని నడిపే ప్రతి ఒక్క వాహనదారుడు వాహనానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంటును కలిగి ఉండాలని మరియు వాటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగే రోడ్డు ప్రమాదాల గురించి వివరిస్తూ వాటిలో ఎక్కువగా యువత అతివేగంగా నడపడం, మద్యం సేవించి నడపడం, మత్తు పదార్థాలను సేవించి రోడ్డు ప్రమాదాల కారణమవుతున్నారని వివరించారు.
డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదని, అలా చేయడంవల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు

*వాహనదారుడు పాఠశాల వద్ద, ఆస్పత్రిలో వద్ద మరియు జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో హారన్ ను ఉపయోగిస్తూ నెమ్మదిగా వెళ్లాలని సూచించారు.
*రోడ్డు మలుపుల వద్ద,జంక్షన్ల వద్ద స్పీడ్ తగ్గించుకొని వెళ్లాలన్నారు.
*పోలీసు వారు వెహికల్ చెకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించేది రోడ్డు ప్రమాదాల నివారణ కోసమేనని దీనిని ప్రజలు అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో భీమారం మండల ప్రజలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment