బీడీ కార్మికుల ఆర్థిక దోపిడీపై దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి

బీడీ కార్మికుల ఆర్థిక దోపిడీపై దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వ సలహాదారు (కేబినెట్ హోదా మంత్రి) పి. సుదర్శన్ రెడ్డికి ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల వినతిపత్రం సమర్పణ

మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి హైదరాబాద్ నవంబర్ 04

బీడీ కార్మికులపై ఆర్థిక దోపిడీ చేస్తూ, కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న దేశాయ్ బ్రదర్స్ కంపెనీపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారులు (కేబినెట్ హోదా మంత్రి) పి. సుదర్శన్ రెడ్డికి ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు వినతి పత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి సుదర్శన్ రెడ్డిని కలిసి భీడీ ఫెడరేషన్ సీనియర్ అధ్యక్షులు ఏ.ఎస్. పోశెట్టి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందన్, మాజీ జెడ్పీ చైర్మన్ ( బి.ఆర్.ఎస్. పార్టీ కార్యదర్శి ) విఠల్ రావు, సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ నిజామాబాద్–కామారెడ్డి సంయుక్త జిల్లా కార్యదర్శి వి. ప్రభాకర్ ఆధ్వర్యంలో బృందం వినతి పత్రం అందజేసింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — దేశాయ్ కంపెనీ కార్మికుల కష్టార్జితాన్ని దోచుకుంటూ, రోజుకు వెయ్యి బీడీలకు చెల్లించాల్సిన కూలీలో పది రూపాయలు తక్కువగా చెల్లిస్తున్నదని, దాంతో పాటు 70 వేల మంది కార్మికుల వద్ద కోట్లాది రూపాయలు దోచుకున్నారని పేర్కొన్నారు. వారు పేర్కొన్నదేమంటే, కంపెనీ కార్మికులకు తగిన ముడిసరుకులు (ఆకు, తంబాకు, దారం) సరిపడా ఇవ్వకపోగా, నాసిరకం నాణ్యత గల పదార్థాలను మాత్రమే అందజేస్తూ వారి జీవనోపాధిని కష్టాల్లోకి నెట్టిందన్నారు. అదేకాకుండా, “పితారా” పేరుతో ఉన్న ప్రభుత్వ అనుమతి లేని నాసిరకం తినుబండారాలను కార్మికులపై బలవంతంగా కొనిపిస్తున్నారనీ, ఇది అక్రమ వ్యాపార పద్ధతికి దారితీస్తోందని ఆరోపించారు.
దేశాయ్ బ్రదర్స్ కంపెనీ చేస్తున్న ఈ ఆర్థిక దోపిడీపై వెంటనే చట్టరీత్య చర్యలు తీసుకొని, గత పది సంవత్సరాలుగా దోచుకున్న కోట్లాది రూపాయలను కార్మికులకు తిరిగి చెల్లించేలా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని బృందం విజ్ఞప్తి చేసింది. మంత్రి సుదర్శన్ రెడ్డిని కలిసిన బృందంలో సీపీఐ(ఎం.ఎల్.) మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి. ప్రభాకర్, రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ, టెలంగాణ ప్రగతిశీల భీడీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్–కామారెడ్డి సంయుక్త జిల్లా అధ్యక్షులు ఎం. ముత్తేన్న, ప్రధాన కార్యదర్శి ఆర్. రమేష్, ఉపాధ్యక్షురాలు వి. సత్తేమ్మ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment