నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి మార్పు ఖాయం
పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పేరే బలంగా వినిపిస్తోంది – పార్టీ వర్గాల్లో చర్చ
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి నిర్మల్, నవంబర్ 4:
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్ష పదవిలో మార్పు ఖాయం అయినట్లు సమాచారం. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికు అత్యంత సన్నిహితుడైన పార్టీ సీనియర్ నాయకుడు పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి పేరు ఈ పదవికి బలంగా వినిపిస్తోంది. మునుపటిగా జడ్పీటీసీగా, అలాగే జిల్లా జడ్పీటీసీల ఫోరమ్ అధ్యక్షుడిగా సేవలందించిన రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకున్నా, పార్టీతో సుదీర్ఘ అనుబంధం కొనసాగించిన నాయకుడిగా పేరుగాంచారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలతో విస్తృత సంబంధాలు కలిగిన ఆయనకు ఈసారి జిల్లా కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ లోపల సీనియర్ నాయకులు, జిల్లాలో కీలక నేతలతో సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం.