కార్తీక మాసంలో గోదావరిలో భక్తుల సందడి
పోచంపాడు గోదావరిలో వందలాది మంది భక్తులు పవిత్ర స్నానాలు
కార్తీక మాస పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం
సమీప గ్రామాల ప్రజలు తండోపతండాలుగా హాజరు
మనోరంజని తెలుగు టైమ్స్ మెండోరా ప్రతినిధి నవంబర్ 03
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడు ప్రాంతంలో గల పవిత్ర గోదావరి నదిలో కార్తీక మాస పూజలు సోమవారం ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి వందలాది మంది భక్తులు నది తీరానికి తరలి వచ్చి పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం సమీప దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, దీపారాధనలు నిర్వహించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఆర్మూర్, బాల్కొండ, మెట్పల్లి, నిర్మల్ పరిసర ప్రాంతాల భక్తులు కుటుంబ సమేతంగా తండోపతండాలుగా విచ్చేసి గోదావరిలో స్నానం చేసి ఆధ్యాత్మిక ఆనందంలో మునిగిపోయారు. నది తీరమంతా భక్తుల జపాలతో, హారతుల కాంతులతో, భజనల స్వరాలతో మారుమోగింది.