బీరవెల్లి లో చిన్నారిపై కుక్కల దాడి – పరిస్థితి విషమం

బీరవెల్లి లో చిన్నారిపై కుక్కల దాడి – పరిస్థితి విషమం

1.5 ఏళ్ల బాలుడిపై కుక్కల దాడి

తీవ్ర గాయాలతో చిన్నారి పరిస్థితి ఆందోళనకరం

నిర్మల్ నుండి హైదరాబాద్‌కు తరలింపు

కుక్కల దాడులు పెరుగుతున్నాయని స్థానికుల ఆవేదన

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 02

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో చిన్నారి సయ్యద్ సహాద్ (వయస్సు 1.5 సంవత్సరాలు)పై కుక్కలు విరుచుకుపడి తీవ్ర గాయాలు చేశాయి. తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా కుక్కలు ఆకస్మాత్తుగా దాడి చేసి ముఖ భాగం, తలపై గాయపరిచాయి. వెంటనే కుటుంబసభ్యులు రక్తస్రావం అవుతుండడంతో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. వెంటనే చిన్నారిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ, కుక్కల దాడులు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారి చికిత్సకు సహకరించాలని ప్రజలను కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment