భక్తులకు కుంటాల బాలా త్రిపుర సుందరి రూపంలో గజ్జలమ్మా దర్శనం
కుంటాల గజ్జలమ్మా దేవస్థానంలో భారీగా భక్తుల రద్దీ
బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు సౌకర్యాల కల్పన
మనోరంజని తెలుగు టైమ్స్ కుంటాల ప్రతినిధి నవంబర్ 02
నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలోని సుప్రసిద్ధ గజ్జలమ్మా దేవస్థానంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో నిలబడి బాలా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి ఆనందంలో మునిగిపోయారు. ప్రత్యేక పూజలు, మొక్కలు చెల్లింపులు, నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల రాకపోకలకు సౌకర్యాలు కల్పించి, తాగునీరు, వసతి, భోజన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల సందర్శనతో కిటకిటలాడింది. ఆధ్యాత్మిక వాతావరణంలో అమ్మవారి భక్తి సందడి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.