ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్?

ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్?

ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్?

బెంగళూరు ట్రాఫిక్‌లో వినూత్న దృశ్యం..

హెల్మెట్‌ బదులు కడాయి!

ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్?

బెంగళూరు నగరంలో ట్రాఫిక్‌ సిగ్నల్ వద్ద చోటుచేసుకున్న విచిత్ర సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
సిటీ ప్రాంతంలో ఓ బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి హెల్మెట్‌ లేకుండా వెళ్తున్న సమయంలో పోలీసుల దృష్టికి పడకుండా ఉండేందుకు చేసిన ‘జుగాడ్’ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వైరల్ వీడియో ప్రకారం.. ట్రాఫిక్‌లో ఒక బైక్ ఇద్దరు యువకులు కూర్చోని ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి హెల్మెట్ ధరించి ఉన్నాడు. అతని వెనుక కూర్చొని ఉన్న పిలియన్ రైడర్ తలకు మాత్రం హెల్మెట్ పెట్టుకోలేదు. కానీ అతను తలకు పెట్టుకున్న వస్తువు చూసి అందరూ షాక్ అయ్యారు.
సాధారణంగా హెల్మెట్‌ ధరించాల్సిన చోట, ఆ వ్యక్తి తలకు వంటకు ఉపయోగించే ‘కడాయి’ పెట్టుకున్నాడు.. కడాయి తలపై పెట్టుకొని వెనక సీట్లో కూర్చున్న అతడిని చూసి అక్కడున్న ఓ వ్యక్తి వీడియో రికార్డు చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్‌లు రకరకాలుగా స్పందించారు. ఎవర్రా నువ్వు ఇలా ఉన్నావ్..? ఫ్రయింగ్ పాన్‌తో ఆమ్లెట్‌ చేయవచ్చు.. కానీ ప్రాణాన్ని కాపాడలేమని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. హెల్మెట్‌ అనేది ఫ్యాషన్‌ ఐటమ్‌ కాదని, ప్రాణ రక్షణ సాధనం అని, ఇలాంటి ‘జుగాడ్’లు ప్రాణాలతో ఆటలు ఆడటమేనని మరోకరు కామెంట్ చేశారు. ట్రాఫిక్‌ నియమాలు కేవలం చలాన్‌ నుంచి తప్పించుకోవడానికి కాదు, తమ భద్రత కోసమని,హెల్మెట్‌ ధరించి బైక్ నడపాలని నెటిజన్ కామెంట్ పెట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment