కపాస్ కిసాన్ యాప్ పై రైతులకు అవగాహన
ముధోల్ మనోరంజని ప్రతినిధి నవంబర్ 1
ముధోల్ మండలం విట్టోలి, విట్టోలి తండా గ్రామంలో ఏఈవో రుషికేష్ రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించారు. పత్తి రైతులకు సీసీఐ అందించే మద్దతు ధరను పొందేందుకు కపాస్ కిసాన్ యాప్ ను గురించి వివరించారు. ఈ యాప్ లో రైతులు స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. పత్తి నాణ్యతను బట్టి క్వింటాలుకు రూ. 8110 వరకు మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు తమ సమీప సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి విక్రయించి మద్దతుధర పొందాలని సూచించారు. రైతులు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి అన్నారు.