భైంసా మార్కెట్‌యార్డ్‌లో నవంబర్ 3 నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

భైంసా మార్కెట్‌యార్డ్‌లో నవంబర్ 3 నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

నవంబర్ 3 నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కార్యక్రమం

భైంసా పరిధిలోని నాలుగు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు

నవంబర్ 2లోపు రైతులు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి

అవసరమైన పత్రాలు, వివరాలు తప్పనిసరి

మనోరంజని తెలుగు టైమ్స్ భైంసా ప్రతినిధి నవంబర్ 01
భైంసా మార్కెట్‌యార్డ్‌లో నవంబర్ 3 నుండి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

నిర్మల్ జిల్లా భైంసా రైతులకు శుభవార్త. సెంట్రల్ కాటన్ కార్పొరేషన్ (CCI) ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కార్యక్రమం భైంసా కాటన్ మార్కెట్ యార్డ్‌లో నవంబర్ 3వ తేదీ (సోమవారం) నుండి ప్రారంభమవుతుందని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు ప్రకటించారు.మొదటి దశలో భైంసా పరిధిలోని నాలుగు జిన్నింగ్ మిల్లులు — యస్.యస్. కాటన్ ఇండస్ట్రీస్, కృషి కాటన్ ఇండస్ట్రీస్, భగవతి కాటన్ ఇండస్ట్రీస్, రాశీ కాటన్ ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్లు జరగనున్నాయి. రైతులు పత్తిని అమ్మదలచినట్లయితే నవంబర్ 2లోపు స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. బుకింగ్ చేసిన రైతులు మొబైల్ ఫోన్, స్లాట్ బుకింగ్ నంబర్, పట్టా పాస్‌బుక్ జిరాక్స్ రెండు ప్రతులు, ఆధార్ కార్డ్ జిరాక్స్ రెండు ప్రతులు తప్పనిసరిగా తీసుకురావాలి. కపాస్ కిసాన్ యాప్‌లో నమోదు చేసిన ఫోన్ నంబర్ రైతు వద్ద ఉండాలని కూడా అధికారులు తెలిపారు. స్లాట్ బుకింగ్ చేసిన రైతుల వివరాలే కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌లో కనిపిస్తాయని, అదే ఆధారంగా పత్తి వాహనాల తూకం మరియు కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. స్లాట్ బుకింగ్ చేయకుండా వచ్చిన రైతుల పత్తి కొనుగోలు జరగదని అధికారులు స్పష్టం చేశారు. బుకింగ్ విధానం గురించి అవగాహన లేని రైతులు తమ క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులను (AEO) సంప్రదించాలని సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment