అడెల్లి పోచమ్మ ఆలయంలో జంతు బలి నిషేధం –
వెలుగులతో మెరిసే ఆలయ ప్రాంగణం
నవంబర్ 3 నుండి 7 వరకు పునః ప్రతిష్టాపన మహోత్సవం – భక్తులు నిబంధనలు పాటించాలంటూ ఆలయ కమిటీ విజ్ఞప్తి
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి నవంబర్ 01
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ అడెల్లి మహా పోచమ్మ దేవాలయంలో పునః ప్రతిష్టాపన మహోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవంబర్ 3 నుండి 7 వరకు నూతన ఆలయ ప్రారంభం మరియు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఘనంగా జరగనుంది.
ఈ సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల లైట్లు, విద్యుత్ అలంకరణలతో అందంగా ముస్తాబు చేశారు. రాత్రివేళల్లో ఆలయం వెలుగులతో మెరిసిపోతూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతోంది.
పునః ప్రతిష్టాపన సందర్భంగా నవంబర్ 3 నుండి 7 వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో జంతు బలి, మద్యపానం వంటి కార్యక్రమాలను పూర్తిగా నిషేధించామని ఆలయ అభివృద్ధి కమిటీ ప్రకటించింది.
భక్తులు ఈ నిర్ణయాన్ని గౌరవించి, శాంతియుతంగా భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. నవంబర్ 9 నుండి పాత సంప్రదాయాలను భక్తులు కొనసాగించవచ్చని తెలిపింది.
అడెల్లి మహా పోచమ్మ అమ్మవారి పునః ప్రతిష్టతో గ్రామం మొత్తం ఆధ్యాత్మిక ఉత్సాహంలో మునిగిపోయింది.