నవంబర్ 7న అడెల్లి మహాపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన
నవంబర్ 3 నుండి 7 వరకు పూజా కార్యక్రమాలు
భక్తుల అధిక హాజరుతో విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపు
ఏర్పాట్లు పరిశీలించిన బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి – సారంగాపూర్, అక్టోబర్ 30
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన అడెల్లి మహాపోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నవంబర్ 7న జరగనుందని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాల్లో ఏర్పాటు జరుగుతున్న పనులను పరిశీలించారు. నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 7 వరకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలలతో పాటు మహారాష్ట్ర రాష్ట్రం నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అడెల్లికి తరలివస్తారని చెప్పారు.
“విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి,” అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.