వధూవరులకు “బుద్ధుడు ఆయన ధమ్మం” గ్రంథం బహుకరించిన అంబేడ్కర్ వాదులు
విశ్వమానవ మైత్రి సందేశంతో నూతన దంపతులకు ఆశీర్వాదం
– తిమ్మాపురం బి.ఆర్ ఫంక్షన్ హాల్లో శుభవివాహం
మనోరంజని తెలుగు టైమ్స్ ( బాల్కొండ ) మోర్తాడ్, అక్టోబర్ 30:
విశ్వమానవ సమాజానికి మైత్రి, కరుణ, ప్రేమ అనే గొప్ప సందేశాన్ని ప్రసాదించిన తథాగతుడు గౌతమ బుద్ధుడి సిద్ధాంతాలను ఆధారంగా చేసుకుని, నూతన దంపతులకు ఆ సందేశాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నంగా అంబేడ్కర్ వాదులు ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం వరుడు నరేందర్ (తిమ్మాపుర్) మరియు వధువు వైశాలి (పాలెం) ల వివాహం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపురం గ్రామ శివారులోని బి.ఆర్ ఫంక్షన్ హాల్లో హాల్లాదకరంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ వాదులు నూతన వధూవరులకు “బుద్ధుడు ఆయన ధమ్మం” అనే పవిత్ర గ్రంథాన్ని బహుకరించారు. “మైత్రి అనేది విశ్వాసానికి ప్రతీక. ఆ విశ్వాసమే నిజమైన ప్రేమను పెంచుతుంది” అని గౌతమ బుద్ధుడు చెప్పిన సూత్రాన్ని గుర్తు చేస్తూ, నూతన దంపతుల బవిష్యత్ జీవితం సుఖసంతోషాలతో నిండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డా. అంబేడ్కర్ యువజన సంఘం మోర్తాడ్ మండల అధ్యక్షులు అంగుళి మాలజీ, డిఎస్పి నేత ఉమేష్ మహారాజ్, తోట బావయ్య మహారాజ్, బషీరాబాద్ బాబురావు మహారాజ్, దళిత సంక్షేమ సంఘం నేత జాంభవ చమార్, అలిండియా అంబేడ్కర్ యువజన సంఘం యువనేత మామిడి రాజు, చెప్పాల రాజేశ్ మహారాజ్, మూలనివాసి మాలజీ తదితరులు పాల్గొన్నారు.