ఓటు వేటు
ప్రజాస్వామ్యానికి ఓటు
తాయిలాల స్వామ్యానికి
వేయాలి వేటు
సుపరిపాలనకు ఓటు
అరాచక పాలనకు వేటు
ఉధ్ధరణకు ఓటు
ఉచ్చితాల పై వేటు
ప్రగతిశీలురకు ఓటు
పార్టీ ఫిరాయింపు దారుల పై
వేయాలి వేటు
అభివృధ్ది సాధకులకు ఓటు
అవినీతిపరులపై వేటు
ప్రభుత్వాలను నిర్మించే ఓటు
జాతి తల రాతనుమార్చే ఓటు
దేశ ఐక్యత భద్రత
సుస్థిరత సంక్షేమం
స్వావలంబన సమగ్రత
దేశ సార్వభౌమత్వ
రక్షకులకు
ఓటు వేసే కాలం
రాజకీయ పార్టీల విచిత్ర
వేషధారణ నాటకాలకు
ఆయారం గయారం
జంప్ జిలానీలకు ఓటుతో
చరమ గీతం పాడాలి
ఊచితాల ఊహల్లో
ఓటరును ఊరడిస్తూ
వారంటీలేని గ్యారంటీల
నినాదాలతో .ఓటర్లకు
గాలం వేసే నాయకులపై
వేయాలి వేటు
స్కీముల స్కాముల దోపిడీ
దొంగల పీడనకు విముక్తి
సారా చీరల పంపిణీల
మాయా మాటల
మాంత్రికుల పై వేయాలి వేటు
చుక్క బొక్క బీరు
బిర్యానీకిలొంగి పోక
మనీ మద్యం ప్రవహంలో
చిక్కుకోక ఊసర వెల్లుల్లాగ
రంగులు మార్చిన పార్టీ
ఫిరాయింపు దారులకు
బుధ్ది చెప్పే కాలం
బూతు మాటలు పలికిన
నాయకులకు పోలింగ్
బూతులోనే ఓటుతో
బుధ్ధి చెప్పే కాలం
చట్టం చేయని పని ఓటర్లు
చేసే కాలం
ఓటుతో నేర చరితులను
అడ్డుకోఅభివృధ్ది ప్రగతి శీలురను
ఎన్నుకో ఉచితాలకు వివిధ
ప్రలోభాలకు లొంగకుండా
ఉత్తమ ప్రజా ప్రతి నిథులను
ఎన్నుకో
ఓటుతో అవినీతి అంతానికి
బాటేయి ప్రజాస్వామ్యానికి
పీటేయి సుపరిపాలనకు
చోటియ్యాలి
ఓటు వజ్రాయుధం ఓటును
అంగట్లో అమ్ముకోకు
జాతి తలరాతను మార్చేది
ఓట్ల కాలమే
ఓటరు దేవుల్లే పార్టీల
గెలుపు ఓటములు నిర్ణయించే
శక్తి ఓటరు తెలివితో ఓటు
వేయాలి సమాజప్రగతికి
బాటేయాలి
ఎన్నికల హామీలను అమలు
చేయని నాయకులపై వేటు
వేయాలి
ఓటు తో సమర్ధులనుఎన్నుకో
ప్రజాస్వామ్య పరిపుష్టికై సాగిపో
(నవంబర్11 న జూబ్లీ హిల్స్
శాసనసభకు జరుగనున్న ఉప
ఎన్నికల సందర్భంగా రాసిన
కవిత)
నేదునూరి కనకయ్య
ఫ్రీలాన్స్ రచయిత
సామాజిక ఆర్థిక విశ్లేషకులు
9440245771