ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు కొత్త హంగులు*

*ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలకు కొత్త హంగులు*

*మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*

హైదరాబాద్‌:అక్టోబర్ 29
ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు ఏళ్ల తరబడి మరమ్మత్తులకు నోచుకోవడం లేదు నిధుల కోసం సంబంధిత కళాశా లల ప్రిన్సిపాళ్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కూడా నిధులు మంజూరుకాలేదు దీంతో ఇబ్బందులు పడుతూనే విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తూండగా అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు.

ఏట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. దీనికోసం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను కొత్త హంగులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ భవనాలకు కొత్త రంగులు వేయనున్నట్టు ప్రకటించిం ది. ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీల భవనాలు రంగులతోనే విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తా యి. కానీ ప్రభుత్వ జూని యర్‌ కాలేజీల భవనాలు వెలిసిపోయి ఉంటాయి. వాటిని చూడగానే ప్రవేశాలు పొందాలన్న అభిప్రాయం కలగదు. అర్హులైన అధ్యాప కులున్నా అందమైన భవనాలుండ వు. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ప్రయివేటు, కార్పొరేట్‌ కాలేజీల్లో చేరడా నికి మొగ్గు చూపుతారు.

దీన్ని గమనించిన ఇంటర్‌ విద్యాశాఖ 429 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల భవనాలకు రంగులు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్‌ విద్యా శాఖ సంచాలకులు ఎస్‌ కృష్ణ ఆదిత్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకు ఒకే రకమైన రంగు వేయాలని నిర్ణయించామని తెలిపారు.

తెలుపు రంగు, చివరన నీలిరంగు ఉంటుందని స్పష్టం చేశారు. మైనర్‌ రిపేర్ల ఫండ్‌ నుంచి నిధుల ను వినియోగించాలని పేర్కొన్నారు. జిల్లా ఇంటర్మీ డియెట్‌ విద్యాశాఖ అధికా రులు డీఐఈవో, నోడల్‌ అధికారులు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల ప్రిన్సి పాళ్లు అన్ని కాలేజీలకు రంగులు వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment