బడా భీంగల్లో పెదంగంటి ఎల్లమ్మ దేవాలయం సమీపంలో కోనేరు నిర్మాణానికి భూమిపూజ
గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా భూమి పూజ – గ్రామ ప్రజల ఆనందం వ్యక్తం
మనోరంజని తెలుగు టైమ్స్, బాల్కొండ ప్రతినిధి గుర్రం నరేష్ — అక్టోబర్ 28, 2025
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామంలో పెదంగంటి ఎల్లమ్మ దేవాలయం సమీపంలో నూతన కోనేరు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మోర్తాడ్ బద్రి, ఉపాధ్యక్షులు వెన్ను ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగల గంగా మోహన్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనేరు నిర్మాణానికి దాతగా ముందుకు వచ్చిన బడా భీంగల్ మాజీ సర్పంచ్ బోనగిరి మురళి టెంకాయ కొట్టి భూమి పూజ నిర్వహించారు. కోనేరు త్వరగా నిర్మాణం పూర్తి కావాలని, గ్రామ ప్రజలకు దీని ద్వారా మంచి జరుగాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామ ప్రధాన దేవతగా ప్రసిద్ధి చెందిన పెదంగంటి ఎల్లమ్మ దేవి ఆలయంలో ప్రతి మంగళవారం జరిగే పూజలు, జాతర వాతావరణాన్ని తలపించేలా భక్తుల రద్దీతో కొనసాగుతున్నాయి.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.