భవిష్యత్తు కోసం
బంగరు బాటలు వేయాలి
మనం ఆశ కొసం పనిచేస్తే
ఆందోళన అలజడి ఆవేశం
ఆక్రందనకు వేదికమౌతాం
ఆశయశం కోసం పనిచేస్తే
ఆదర్శంగా నిలుస్తాం
ఆశించిన చోట ఆనందం
ఉండదు శాసించిన చోట
సంతోషం ఉండదు కృషి లేని
చోట సంపద ఉండదు
సమాజ హితం మన
అభిమతమౌతే
సమాజానికి మార్గదర్శుం
అవుతాం స్పూర్తిగా నిలుస్తాం
స్వార్థం మాని త్యాగం చేస్తే
తర తరాలకు తరగని పెన్నిధి
అవుతాం ప్రభావ శీలమైన
మన వ్యక్తిత్వంతో ప్రజాసేవలో
తరిస్తేజాతికి రత్నం అవుతాం
మమత సమత సౌహార్డత
సంఘీభావం మన జీవనశైలి
అవుతే సమాజానికి వెలుగు
అవుతాం చరిత్ర లో నిలిచి
పోతాం చిరస్మరణీయులుగా
మిగిలిపోతాం
ఆత్మీయత అభిమానం
ఆప్యాయత అవగాహన
ఆదరణ మనచిరునామా
అవుతే అందరికి భందువు
అవుతాం మార్గదర్శులమై
అభివృద్ధి పురోభివృద్ధికిఅడ్డా
అవుతాం మంచిని పెంచి
వంచన తుంచి చేతనను పెంచి
ప్రేమను పంచిద్వేషం మోసం
మాని సహనం సమన్వయం
సమభావం అనే పునాదుల పై
ప్రగతశీల సమాజ
స్థాపనకు ఉపక్రమిద్దాం
అభివృద్ధి సమాజ ఉద్దరణే
ఉద్దేశమైతే ఉజ్వల
భవిష్యత్తుకు మానవీయ
విలువలకు మనమే
ప్రథాతలమౌధాం ఉత్తమ
విలువల తోఉన్నత
స్థాయిలో రాణించి
బంగారు భవితకు బాటలు
వేద్దాం మెరుగైన సమాజ
నిర్మాణానికి పాటుపడుతాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
హైదరాబాద్
9440245771