కొండెక్కిన లింబగిరిశుడు, నింబాచల లక్ష్మీ నృసింహుడు

కొండెక్కిన లింబగిరిశుడు, నింబాచల లక్ష్మీ నృసింహుడు

దక్షిణబద్రినాథ్ లింబాద్రిగుట్ట కార్తీక మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 27

కొండెక్కిన లింబగిరిశుడు, నింబాచల లక్ష్మీ నృసింహుడు

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని గల దక్షిణ బద్రినాథ్ గా పేరుగాంచిన శ్రీ నింబాచల క్షేత్రం పై ఈనెల 27 సోమవారం నుండి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచారు. బోయలు పల్లకి మోస్తుండగా ,మేళతాళాలు మంగళారతులు వెంటనడిచాయి. సుహాసినిలు నెత్తిన బోనాలు ధరించి గ్రామాలయం నుండి కొండపైకి తీసుకెళ్లారు.దారిపొడవున గోవింద నామ స్మరణలతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అత్యంత ప్రత్యేకమైన ఆలయాల్లో భీంగల్ నింబాచాల క్షేత్రం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి ఆలయ అర్చకులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఇక్కడ జరగబోయే జాతర ఉత్సవాలు నిర్వహిస్తు, భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment