కమ్మర్పల్లి కస్తూర్బా పాఠశాలకు మంజూరైన నిధుల పలు పనులకు భూమి పూజ

కమ్మర్పల్లి కస్తూర్బా పాఠశాలకు మంజూరైన నిధుల పలు పనులకు భూమి పూజ

కమ్మర్పల్లి కస్తూర్బా పాఠశాలకు మంజూరైన నిధుల పలు పనులకు భూమి పూజ

మనోరంజని తెలుగు టైమ్స్ బాల్కొండ ప్రతినిధి అక్టోబర్ 27

నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ పాఠశాలలో డైనింగ్ హాల్, బాత్రూమ్స్, సీసీ పనుల కొరకు 15లక్షల నిధులు మంజూరు కాగా, సోమవారం కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటి ఛైర్మెన్ పాలేపు నర్సయ్య, వైస్ ఛైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి కలిసి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.ఏం.సీ. ఛైర్మెన్ పాలెపు నర్సయ్య మాట్లాడుతూ,,, కాంగ్రెస్ పార్టీ బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జీ ముత్యాల సునీల్ రెడ్డి గతంలో కస్తూర్బా పాఠశాలను సందర్శించినప్పుడు పాఠశాలకు కొన్ని మౌలిక వసతులు అవసరం ఉందని అన్ని గ్రహించిన సునీల్ రెడ్డి ప్రత్యేక చొరవతో కస్తూర్బా పాఠశాలకు ప్రభుత్వం పరంగా 15లక్షల నిధులు మంజూరు చేయించారు,అందుకు సునీల్ రెడ్డి ను పాఠశాల తరపున కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపున ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చినప్పటి నుండి పాఠశాల పై ప్రత్యేక దృష్టి పెట్టి, విద్యార్థులు తినడానికి పౌష్టిక ఆహారం మెనూ పెంచి అన్ని వసతులు కల్పిస్తున్న కాంగ్రెస్ పార్టీ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మల్లయ్య, అంజమ్మ, రాజేశ్వర్, గంగారెడ్డి , సల్లురి గణేష్, దూలురు కిషన్ శైలేందర్,జగదీష్, రంజిత్, దీపక్ , నాగరాజ్,చంద్రకాంత్ ,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment