పేదరికంలో పుట్టి పట్టుదలతో ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థి
-
బోధన్‌కు చెందిన పేద విద్యార్థి సాయి వర్ధన్ విజయం
-
పట్టుదలతో విద్యాభ్యాసం చేసి ఎంబీబీఎస్ సీటు సాధన
-
సామాజిక కార్యకర్త సనా పటేల్ చేతులమీదుగా సన్మానం
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన అంబేద్కర్ కాలోనీ విద్యార్థి సాయి వర్ధన్ పేదరికాన్ని జయించి పట్టుదలతో చదువుకుని ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఆదివారం సన్మాన కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సనా పటేల్ ఆయనను అభినందించారు. భవిష్యత్తులో ప్రజల సేవలో భాగస్వామ్యం కావాలని సూచించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని అంబేద్కర్ కాలోనికి చెందిన సాయి వర్ధన్ అనే విద్యార్థి పేద కుటుంబంలో జన్మించినా పట్టుదలతో చదువులో ప్రతిభ కనబరిచి ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త సనా పటేల్ మాట్లాడుతూ — సాయి వర్ధన్ పేదరికాన్ని లెక్క చేయకుండా కష్టపడి విద్యను అభ్యసించి ఎంబీబీఎస్ సీటు సాధించడం బోధన్ పట్టణానికి గర్వకారణమని అన్నారు. ఆయన లాంటి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు సమాజం చేయూత అందించాలని కోరారు. భవిష్యత్తులో డాక్టర్‌గా ప్రజల ఆరోగ్య సేవలకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ గౌడే, కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థి విజయం యువతకు ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయపడ్డారు.