.
అడెల్లి పోచమ్మ ఆలయ ఇన్‌చార్జ్ ఈవో భూమయ్యకు టైల్ బజార్ యూనియన్ సన్మానం
నూతన ఈవోగా భూమయ్య బాధ్యతల స్వీకారం
టైల్ బజార్ యూనియన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని భూమయ్య హామీ
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 26
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహా పోచమ్మ ఆలయానికి భూమయ్య గురువారం నూతన ఇన్‌చార్జ్ కార్యనిర్వహణ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తన ప్రాధాన్యమని భూమయ్య తెలిపారు. ఈ సందర్భంగా టైల్ బజార్ యూనియన్ ఆధ్వర్యంలో భూమయ్యను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దినేష్, గంగాధర్, నరేష్, సాయి కృష్ణ గౌడ్, రాము, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.