ఇంటి నిర్మా
సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామంలో ఘటన – పామును చాకచక్యంగా పట్టుకున్న శేఖ్ యాసిన్
మనోరంజని తెలుగు టైమ్స్ – సారంగాపూర్ ప్రతినిధి, అక్టోబర్ 26
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆలూరు గ్రామంలో ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశంలో నాగుపాము దర్శనమిచ్చి స్థానికులను భయాందోళనకు గురి చేసింది.పాము కనిపించడంతో అక్కడి ప్రజలు అప్రమత్తమై, వెంటనే పాములు పట్టే నిపుణుడు శేఖ్ యాసిన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న యాసిన్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని చాకచక్యంగా ఆ పామును పట్టుకున్నారు. సుమారు 6 అడుగుల పొడవు మరియు సుమారు 40 సంవత్సరాల వయస్సు గల ఈ నాగుపాము పెద్దదైనదని ఆయన తెలిపారు. ఇలాంటి పాములు గ్రామ పరిసర ప్రాంతాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తాయని యాసిన్ పేర్కొన్నారు. తాను పట్టుకున్న పామును అటవీ శాఖ అధికారుల సమక్షంలో అటవీ ప్రాంతంలో విడిచిపెడతానని ఆయన తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో కొంతసేపు కలకలం రేగింది.