సామాజిక న్యాయం బీఎస్పీతోనే సాధ్యం – బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి: అడ్వకేట్ జగన్ మోహన్

సామాజిక న్యాయం బీఎస్పీతోనే సాధ్యం – బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి: అడ్వకేట్ జగన్ మోహన్

సామాజిక న్యాయం బీఎస్పీతోనే సాధ్యం – బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి: అడ్వకేట్ జగన్ మోహన్



స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42% అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు



నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్ మోహన్ మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తక్షణం అమలులోకి తేవాలని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

ఆయన మాట్లాడుతూ — “రిజర్వేషన్లు జనాభా ఆధారంగా పెరగాలి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మొసలి కన్నీరు కారుస్తున్నాయి” అని విమర్శించారు.

మండల్ కమిషన్ ఏర్పాటుతో 27% రిజర్వేషన్లు సాధ్యమైనప్పటికీ, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు.

“మాన్యశ్రీ కాన్షీరాం గారు బీసీల కోసం చేసిన పోరాటం వల్లే వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ఎన్నికల్లో అవకాశాలు దక్కాయి. కానీ చట్ట సభలలో బీసీలకు నేటివరకు రిజర్వేషన్ లేకపోవడం దారుణం” అని అన్నారు.

బీఎస్పీ ద్వారానే బహుజనులకు నిజమైన సామాజిక న్యాయం సాధ్యమని జగన్ మోహన్ స్పష్టం చేశారు. నవంబర్ 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం భారీ ఆందోళన చేపట్టనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు లక్ష్మీ యాదవ్, కొత్తపల్లి రాజేశ్వర్, జోసఫ్ గంగారాం, కాటం ప్రభాకర్, పూజా, శ్రీనివాస్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment