శశిధర్ రాజు టీం కి NIT వరంగల్లో ప్రథమ బహుమతి
Python Bug Buster Challenge లో విజయం సాధించిన శశిధర్ రాజు టీం — నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలకు గర్వకారణం
హైదరాబాద్లోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న శశిధర్ రాజు టీం, NIT వరంగల్లో నిర్వహించిన Python Bug Buster Challenge లో ఫస్ట్ ప్రైజ్ సాధించింది. ఈ విజయంతో కళాశాల పేరు ప్రతిష్టలు పెరిగాయి.
కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం మరియు సిబ్బంది శశిధర్ టీం సాధించిన విజయంపై గర్వంగా స్పందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు బట్టు శ్రీధర్ రాజు, సవిత తమ కుమారుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.