బాసర గంగా పుత్రులను కాపాడండి – ఆత్మహత్య ప్రయత్నం చేసిన వృద్ధుడిని రక్షించిన యువకుడు
-
గోదావరి తీరంలో మళ్లీ ఆత్మహత్య యత్నం
-
బాసరలో వృద్ధుడి ప్రాణాలను కాపాడిన ధైర్యవంతుడు సాయిలు
-
పోలీసులకు సమాచారం ఇచ్చి సాయంగా నిలిచిన స్థానికుడు
-
గజ ఈతగాళ్లను నియమించాలని భక్తుల విజ్ఞప్తి
బాసర గోదావరి నదిలో మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చోటుచేసుకుంది. కుటుంబ సమస్యలతో వృద్ధుడు నదిలో దూకబోతుండగా, స్థానిక యువకుడు కర్రీ సాయిలు ధైర్యంగా ముందుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధుడిని సురక్షితంగా తరలించారు. గజ ఈతగాళ్లను నియమించాలని భక్తులు అధికారులు కోరుతున్నారు.
నిజామాబాద్ జిల్లా బాసరలోని పవిత్ర గోదావరి నది మళ్లీ ఆత్మహత్యలకు నిలయంగా మారుతోంది. కొద్ది నెలలుగా ప్రశాంతంగా ఉన్న గోదావరి తీరంలో శుక్రవారం మరోసారి దుర్ఘటన చోటుచేసుకుంది. దుబ్బగల్లికి చెందిన ఓ వృద్ధుడు కుటుంబ సమస్యలతో తీవ్ర ఆవేశంలో నదిలో దూకేందుకు ప్రయత్నించాడు.
అయితే అదే సమయంలో అక్కడ ఉన్న స్థానిక యువకుడు కర్రీ సాయిలు ధైర్యంగా ముందుకు దూసుకెళ్లి వృద్ధుడిని ప్రాణాలతో రక్షించాడు. అనంతరం వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వృద్ధుడిని సురక్షితంగా తరలించారు.
స్థానికులు సాయిలు ధైర్యసాహసానికి అభినందనలు తెలిపారు. గోదావరి వద్ద భక్తులు, సందర్శకుల రక్షణ కోసం గజ ఈతగాళ్లను శాశ్వతంగా నియమించాలని అధికారులను కోరుతున్నారు.