*తుది దశకు చేరిన డీ” సీసీ అధ్యక్షుల ఎంపిక*
మనోరంజని తెలుగు టైమ్స్ ప్రతినిధి*
హైదరాబాద్:అక్టోబర్ 26
తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షుల భర్తీలో పార్టీ అధిష్టానం తుది కసరత్తు ప్రారంభించింది, మొత్తం 35 డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సగానికి పైగా కేటాయించాలని నిర్ణయించి నట్లు సమాచారం.. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొత్త అధ్యక్షుల ఎంపిక ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి..
కొత్త అధ్యక్షుల ఎంపికలో సామాజిక న్యాయం పాటిం చాలని, అన్నివర్గాలకు తగిన అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. శనివారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై శనివారం సాయంత్రం కీలక సమావేశం జరిగింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సంస్థాగత కేసీ వేణుగోపాల్, పార్టీ తెలంగాణ వ్యవహా రాల ఇన్చార్జి మీనాక్షి నట రాజన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ వేర్వేరుగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కేసీ వేణు గోపాల్ రాష్ట్ర నేతల నుంచి డీసీసీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలను తెలుసు కున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను మరింత బలోపే తం చేయడం, సంఘటన్ సృజన్ అభియాన్ పురోగతి, జిల్లాస్థాయి నాయకత్వ మార్పులపై చర్చించారు.
ఈసారి డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధిం చి ఏఐసీసీ ప్రత్యేకంగా అబ్జర్వర్లను నియమించిన సంగతి తెలిసిందే. 22 మంది ఏఐసీసీ అబ్జర్వర్లు రాష్ట్రంలో పర్యటించి, ఒక్కో జిల్లా నుంచి ముగ్గురు, నలుగురు పేర్లతో కూడిన నివేదికలను అధిష్ఠానానికి అందజేశారు. శనివారం భేటీలో కేసీ వేణుగోపాల్ ఆ నివేదికల ను ముందు పెట్టుకుని రేవంత్, భట్టి, మహేశ్ గౌడ్లతో మాట్లాడారు.
జిల్లాల్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళల కేటగిరీల్లో బలమైన నేతలు ఎవరెవరు ఉన్నారు? పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? గతంలో ఏయే పదవుల్లో ఉన్నారు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? అసెంబ్లీ ఎన్నికల సమయం లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వారి పాత్ర ఏమిటనే అంశాలపై చర్చించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్ లక్ష్యమని రాహుల్ గాంధీ స్పష్టంగా ప్రకటించిన నేపథ్యంలో.. డీసీసీల్లోనూ సామాజిక న్యాయం ఉండాలని వేణుగోపాల్ సూచించారు.
ఈ క్రమంలో రాష్ట్ర నేతలను మరోసారి ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, మంత్రుల మధ్య విభేదాలు, పార్టీ అంతర్గత అంశాలు, మంత్రి వర్గ విస్తరణ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలపైనా భేటీలో చర్చ జరిగినట్టు పేర్కొన్నాయి.