తల్లి బిడ్డకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలి: కలెక్టర్ అభినవ్ అభిలాష

కలెక్టర్ పోషణ అభియాన్ ప్రారంభిస్తున్న దృశ్య
  • జాతీయ పోషణ్ అభియాన్ ప్రారంభం
  • గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పోషకాహారం ప్రాధాన్యం
  • 926 అంగన్వాడి కేంద్రాల్లో కార్యక్రమం అమలు
  • కిచెన్ గార్డెన్ లు ఏర్పాటు చేయాలని సూచన
  • ఆరోగ్య పరీక్షలు, పోషణపై అవగాహన కల్పించాల్సిన అవసరం

కలెక్టర్ పోషణ అభియాన్ ప్రారంభిస్తున్న దృశ్య

కలెక్టర్ పోషణ అభియాన్ ప్రారంభిస్తున్న దృశ్య






కలెక్టర్ పోషణ అభియాన్ ప్రారంభిస్తున్న దృశ్య

నిర్మల్ : సెప్టెంబర్ 19

నిర్మల్ జిల్లాలో జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో కలెక్టర్ అభినవ్ అభిలాష తల్లి, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించాలనారని చెప్పారు. 926 అంగన్వాడి కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలు చేయాలనీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పాలు, గుడ్లు అందించాలని ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభినవ్ అభిలాష జాతీయ పోషణ్ అభియాన్ కార్యక్రమంలో తల్లి, బిడ్డలకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడం అత్యవసరమని తెలిపారు. గురువారం పట్టణంలోని టీఎన్జీవోస్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, గర్భిణీలు, బాలింతలు, పిల్లలు పోషకాహారం పొందడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమని అన్నారు. అంగన్వాడి సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి పోషణ, పోషకాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

జిల్లాలోని 926 అంగన్వాడి కేంద్రాల్లో పోషణ అభియాన్ కార్యక్రమం అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. అంగన్వాడి, ఆశ, వైద్య సిబ్బంది సమన్వయంతో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, పోషకాహారం అందించాలన్నారు. పోషణ లోపం ఉన్న చిన్నారులను గుర్తించి, వారికి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ నాగలక్ష్మి, వైద్యులు నయన రెడ్డి, సౌమ్య, సూపర్వైజర్లు, అంగన్వాడి సిబ్బంది, గర్భిణీలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment