రామవరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు – విద్యార్థుల భవిష్యత్తు చీకట్లో

రామవరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు – విద్యార్థుల భవిష్యత్తు చీకట్లో


 

  • ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

  • నెలల తరబడి పాఠశాలలకు హాజరు కాని టీచర్లు

  • విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం

  • అధికారుల చర్య కోసం ప్రజల విజ్ఞప్తి


రామవరం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు – విద్యార్థుల భవిష్యత్తు చీకట్లో

రామవరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల గైర్హాజరు విద్యార్థుల భవిష్యత్తును చీకట్లోకి నెట్టింది. కొంతమంది టీచర్లు సెలవులు పేరుతో నెలల తరబడి రాకుండా ఉన్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు కలెక్టర్ దృష్టి సారించాలని కోరుతున్నారు.


 

రామవరం గ్రామ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు రోజురోజుకూ పడిపోతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఉపాధ్యాయులు సెలవులు అని చెబుతూ నెలల తరబడి పాఠశాలలకు రాకుండా ఉన్నారని, దీంతో విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోతున్నారని తల్లిదండ్రులు తెలిపారు.

పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలు ఖాళీగా మారి, తరగతులు సరిగ్గా నిర్వహించబడకపోవడంతో విద్యార్థుల హాజరు కూడా తగ్గిపోతోంది.

ప్రజలు కలెక్టర్‌ను ఉద్దేశిస్తూ — “ఫోటోలకు మాత్రమే పరిమితం కాకుండా, జిల్లాలోని ప్రతి ప్రభుత్వ శాఖలో జరుగుతున్న అవినీతి, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిబద్ధతతో పనిచేసే వాతావరణం నెలకొల్పితేనే విద్యార్థుల భవిష్యత్తు వెలుగులోకి వస్తుందని వారు అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment