నూతన పద్ధతిలో ట్రాఫిక్ అవగాహన – మాల్వెకర్ ధర్మేంద్ర సృజనాత్మక ఆడియో–వీడియో చిత్రీకరణకు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ప్రశంస
మనోరంజని తెలుగు టైమ్స్ నిజామాబాద్ ప్రతినిధి
ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచడానికి సరికొత్త ఆలోచనలతో ముందుకొచ్చిన మాల్వెకర్ ధర్మేంద్ర రూపొందించిన ఆడియో–వీడియో చిత్రీకరణను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారికి చూపించారు.
ఈ చిత్రీకరణలో రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ ప్రాధాన్యం వంటి అంశాలను ఆకర్షణీయంగా, సులభంగా అర్థమయ్యే శైలిలో చూపించారు.
చిత్రీకరణను వీక్షించిన ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ గారు, “ఇలాంటి వినూత్న పద్ధతుల ద్వారా ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల ఆసక్తి, అవగాహన పెరుగుతుంది. ధర్మేంద్ర తీసుకున్న ఈ సృజనాత్మక ప్రయత్నం అభినందనీయం” అని తెలిపారు.
అలాగే ఆయన ట్రాఫిక్ విభాగం తరఫున ఈ వీడియోకు ఆమోదం తెలుపుతూ, “యువతలో ట్రాఫిక్ శాస్త్రం పట్ల చైతన్యం రేపడానికి ఇలాంటి ప్రయత్నాలు మరింత అవసరం” అన్నారు.