ఆలూరి గ్రామంలో తాతాయి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభం
గ్రామ ప్రజల ఉత్సాహభరిత పాల్గొనిక
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ ప్రతినిధి అక్టోబర్ 24
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలం, ఆలూరి గ్రామం:
గ్రామంలో గురువారం నుండి తాతాయి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. కార్యక్రమం మొదటి రోజున తాతాయి పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించగా, శుక్రవారం రోజున విగ్రహాలను ఊరేగింపుగా గ్రామమంతా తీసుకువచ్చి తాతాయి సన్నిధిలో ప్రతిష్టకు ముందు ఉంచారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలూరి గ్రామంలో గణపతి పూజ, హోమం వంటి ధార్మిక కార్యక్రమాలు విశేషంగా నిర్వహించబడ్డాయి.
తాతాయి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరగనుంది. అనంతరం గ్రామ ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది.
ఈ ప్రతిష్టా కార్యక్రమాలను ఆలూరి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువతీ యువకులు, గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.