అనేక సమస్యల మధ్య అడెల్లి పోచమ్మ దేవస్థానం ఇన్చార్జి ఈవోగా భూమయ్య

అనేక సమస్యల మధ్య అడెల్లి పోచమ్మ దేవస్థానం ఇన్చార్జి ఈవోగా భూమయ్య

సారంగాపూర్ (నిర్మల్), అక్టోబర్ 23:

అనేక సమస్యల మధ్య అడెల్లి పోచమ్మ దేవస్థానం ఇన్చార్జి ఈవోగా భూమయ్య

అనేక సమస్యల మధ్య అడెల్లి పోచమ్మ దేవస్థానం ఇన్చార్జి ఈవోగా భూమయ్య
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధ అడెల్లి శ్రీ మహా పోచమ్మ దేవస్థానం కొత్త ఇన్చార్జి ఈవోగా భూమయ్య బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ గతంలో ఈవో రమేష్ జైనూర్ మల్లన్న ఆలయానికి బాధిలీగా మార్చబడటంతో, భూమయ్య దత్తాత్రేయ మందిర్ ఈవోగా ఉన్నప్పటికీ ఇప్పుడు అడెల్లి పోచమ్మ ఆలయ ఇన్చార్జిగా నియమితులయ్యారు. దీర్ఘకాలంగా పలు సమస్యలతో ఎదుర్కొంటున్న ఈ ఆలయంలో, పెద్ద సంఖ్యలో భక్తులు, దాతలు దర్శనానికి వస్తున్నారు. అయితే, సరైన మరుగుదొడ్లు, నీటి సరఫరా, కరెంట్ సమస్యలు తదితర అంశాలపై ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల భక్తులకు కష్టం ఏర్పడుతోంది. భూమయ్య ఈవోగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్యలపై సమయోచిత చర్యలు తీసుకుంటారని ఆలయ సిబ్బంది, భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ సింగం భోజ్ గౌడ్ శాలువాతో భూమయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాజేష్, రికార్డు అసిస్టెంట్ బుచ్చన్న, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, తుమ్మ సాయన్న, లక్ష్మణ్, సోని, గంగోత్రి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment