ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

వర్ని
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామంలో ఎస్టీ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైనట్టు ప్రజలు చెబుతున్నారు. దీపావళి సెలవు సందర్భంగా ఇంటికి వెళ్లిన విద్యార్థులు బుధవారం తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు వచ్చి వదిలి వెళ్ళినట్టు సమాచారం. సుదులంతాండ గ్రామానికి చెందిన కిరణ్ 9వ తరగతి బెల్లా నాయక్ తాండ చెందిన రవీందర్ 9వ తరగతి ఇద్దరు విద్యార్థులకు వారి వారి తల్లిదండ్రులు ఆశ్రమం పాఠశాలలో వదిలి వెళ్ళినట్టు సమాచారం. విద్యార్థులకు వదిలి వెళ్ళిన తర్వాత ఇద్దరు విద్యార్థులు కనిపించకపోవడంతో ప్రిన్సిపల్ మరియు సిబ్బంది వెతుకులాట ప్రారంభించారు ఈ విషయం వారి తల్లిదండ్రులు చెప్పడంతో వారు కూడా వెతుకులాట ప్రారంభించారు. బుధవారం అదృశ్యమైన విద్యార్థులు గురువారం వరకు వారి ఆచూకీ తెలియక పోవడంతో హైరానా పడ్డారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల సిబ్బంది ప్రిన్సిపాల్ వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చారు ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఎస్ఐ హుటాహుటిన స్పందించి వెతుకులాట ప్రారంభించారు.

ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ సిబ్బంది నిర్లక్ష్యమే విద్యార్థులు అదృశ్యానికి ప్రధాన కారణం

నిజామాబాద్ జిల్లా వర్ని మండలం కోటయ్య క్యాంపు గ్రామంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం వెనుక వార్డెన్ ,ప్రిన్సిపాల్ ,సిబ్బంది నిర్లక్ష్యం తీవ్రంగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు వదిలి వెళ్ళిన తర్వాత వారిపై ఆజమాసి పెట్టవలసిన ప్రిన్సిపాల్ వార్డెన్ పెట్టకపోవడం చాలా దారుణం అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపాల్ కు మాట్లాడడంతో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని పిల్లల తల్లిదండ్రులు వదిలి వెళ్ళిన తర్వాత వారే వెళ్ళిపోవడం జరిగిందని పొంత లేని సమాధానం ఇవ్వడం జరిగింది.

గురువారం మధ్యాహ్నం విద్యార్థులు ఆచూకీ లభ్యం

వర్ని మండలం కోటయ్య క్యాంప్ గ్రామంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు ఆచూకీ గురువారం మధ్యాహ్నం లభించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ వార్డెన్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. వర్ని ఎస్ఐ పోలీసులు ఎంతో చాకచక్యంగా విద్యార్థులు ఆచూకీ తెలుసుకోవడంలో, విషశకృషి అందించడం పట్ల ప్రజలు వారి సేవలకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment