జాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

జాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

మనోరంజని ప్రతినిధి – సారంగాపూర్, అక్టోబర్ 20

జాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం

సారంగాపూర్ మండలం జాం గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజ్జుమాన్, KNR ట్రస్ట్ చైర్మన్ కోర్వ నవీన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లోజీ నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు జగదీశ్, నారాయణ్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అజ్జుమాన్ మాట్లాడుతూ, యువత క్రీడల్లో పాల్గొని ఆరోగ్యంగా, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం పెంపొందుతుందని పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment