అఖండ హరినామా సప్తహ లో పాల్గొన్న ఎమ్మెల్యే
మనోరంజని తెలుగు టైమ్స్ కుబీర్ ప్రతినిధి అక్టోబర్ 20
నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్ది (కె )గ్రామంలో జరుగుతున్న అఖండ హరినామ సప్తహాలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఆహ్వానించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పటేల్ మాట్లాడుతూ సప్తహాలతో గ్రామాల్లో ఐక్యత భావం పెంపొందుతుందన్నారు. ఆధ్యాత్మికతతో ప్రతి ఒక్కరికి భక్తి భావంతో పాటు, మానసిక శాంతి లభిస్తుందన్నారు. కార్యక్రమాల్లో ఆయన వెంట బిజెపి మండల నాయకులు ఉన్నారు