దీపావళి సందర్బంగా కాంగ్రెస్ నాయకుడు శ్రీహరి రావుకు యువనాయకుల శుభాకాంక్షలు
-
నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరి రావుకు పూదరి అరవింద్, గాజుల రవికుమార్ శుభాకాంక్షలు
-
ప్రేమ, ఐకమత్యం, సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపు
-
ప్రజలు సురక్షితంగా, ఆనందంగా దీపావళి జరుపుకోవాలని సూచన
దీపావళి పండుగ సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీహరి రావును యువ నాయకులు పూదరి అరవింద్, గాజుల రవికుమార్ కలసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు ప్రజలందరికీ వెలుగులు, ప్రేమ, ఐకమత్యం నిండిన జీవితం కలగాలని ఆకాంక్షిస్తూ, పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.
దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ వెలుగులు, ఆనందాలు, సంతోషాలు నిండిన జీవితం కలగాలని ఆకాంక్షిస్తూ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీహరి రావును యువ నాయకులు పూదరి అరవింద్, గాజుల రవికుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ “దీపావళి పండుగ వెలుగులు చీకట్లను పారద్రోలినట్లే మన హృదయాల్లోని ద్వేషం, అసూయ, అజ్ఞానం వంటి చీకట్లను తొలగించి ప్రేమ, ఐకమత్యం, సౌభ్రాతృత్వం పెంపొందించాలి. ప్రతి కుటుంబంలో వెలుగులు, ప్రతి మనసులో ఆనంద దీపాలు వెలగాలని” ఆకాంక్షించారు.
అలాగే ప్రజలు సంతోషంగా, సురక్షితంగా పండుగను జరుపుకోవాలని సూచించారు.