నిందితుడి దాడితో మృతి చెందిన పోలీస్ ప్రమోద్‌కు నివాళి – రియాజ్‌ను ఉరితీయాలని డిమాండ్

నిందితుడి దాడితో మృతి చెందిన పోలీస్ ప్రమోద్‌కు నివాళి – రియాజ్‌ను ఉరితీయాలని డిమాండ్

నిందితుడి దాడితో మృతి చెందిన పోలీస్ ప్రమోద్‌కు నివాళి – రియాజ్‌ను ఉరితీయాలని డిమాండ్

 

  • విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్‌పై రియాజ్ కత్తితో దాడి

  • ప్రజలు సహాయం చేయకపోవడం పట్ల సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆవేదన

  • డాక్టర్ సాప పండరి ఆధ్వర్యంలో మౌనం పాటించి నివాళి

  • రియాజ్‌ను ఉరితీయాలని, పోలీస్ వ్యవస్థకు ప్రజల మద్దతు కావాలని విజ్ఞప్తి



నిజామాబాద్ జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్‌ను రియాజ్ కత్తితో పొడిచి చంపిన ఘటనపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి ఆధ్వర్యంలో ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పించారు. రియాజ్‌ను వెంటనే ఉరితీయాలని, ప్రజలు పోలీస్ వ్యవస్థకు అండగా ఉండాలని ఆయన కోరారు.



నిజామాబాద్ జిల్లాలో జరిగిన భయానక ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. నిందితుడైన రియాజ్‌ను పట్టుకొని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తున్న సమయంలో, అతను తన వద్ద ఉన్న కత్తితో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ప్రమోద్‌పై దాడి చేసి హత్య చేశాడు. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను ప్రజలు కేవలం చూసినప్పటికీ, ఎవరూ సహాయం చేయకపోవడం బాధాకరమని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రతినిధి డాక్టర్ సాప పండరి తెలిపారు.

కుబేర్ గ్రామ యువకుల సమక్షంలో ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇటువంటి ఉన్మాదులను కఠినంగా శిక్షించి ప్రజలలో భయం, పోలీస్ వ్యవస్థపై విశ్వాసం నెలకొల్పాలని డిమాండ్ చేశారు.

అలాగే, ఇటీవల కుబీర్ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ నారాయణపై కూడా ఇలాంటి దాడి జరిగిన విషయాన్ని గుర్తుచేసి, పోలీసులు రక్షకులుగా పనిచేస్తూ రక్షణ లేకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సాప పండరి సీఎం రేవంత్ రెడ్డి, డిజిపి జితేందర్‌ను ఈ ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో యువకులు పెండ్కర్ సతీష్, నరేష్ చారి, యాదం శంకర్, గాజుల దత్తాత్రి, ధనగరి దత్తాత్రి, బొమ్మడి యోగేష్, ప్యాట మహేష్, రాజు ఠాగూర్, తోకల రాజు, దీపాయి వెంకటేష్, రావుల సాయినాథ్, ముప్కల్ సతీష్, సంగి యోగేష్, కుర్నపు రవి తదితరులు పాల్గొన్నారు.

వారు “అమర్ రహే పోలీస్ ప్రమోద్ అమర్ రహే… జోహార్ పోలీస్ ప్రమోద్ అన్నకు జోహార్” అంటూ నినాదాలు చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment