దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గ్రంథాలయ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
మనోరంజని టైమ్స్ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి అక్టోబర్ 19 : రాష్ట్ర ప్రజలకు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.నరకాసుర వధ
తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకొని
సంతోషంగా నిర్వహించుకొనే వెలుగుల పండుగ
దీపావళి. అసమానతల చీకట్లను పారదోలి తోటి వారి జీవితాల్లో వెలుగులు పంచేలా దివ్వెల పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నియంతృత్వ చీకట్లను తరిమి ప్రజాస్వామ్య వెలుగులు పూయించిన ప్రజలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుగానే ఒకరికొకరు చేయుతగా నిలిచి ప్రజా ప్రభుత్వ లక్ష్యమైన సకల జనుల సంక్షేమానికి, తెలంగాణ ప్రగతికి పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు.