బాసరలో శ్రీ లలిత చంద్రమౌళిశ్వర ఆలయ ప్రతిష్టాపన
జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామివారి చేతుల మీదుగా ఆలయ ప్రతిష్టాపన
కార్యక్రమానికి ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి హాజరు
మనోరంజని తెలుగు టైమ్స్ బాసర ప్రతినిధి అక్టోబర్ 19
బాసర మండల కేంద్రంలో శ్రీ లలిత చంద్రమౌళిశ్వర ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం ఆధ్యాత్మిక వైభవంతో జరిగింది. శృంగేరి శ్రీ శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ మహాస్వామివారి సంపూర్ణ అనుగ్రహంతో, తత్కారకముల సంజాతులైన జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామి వారిచే ఆలయ ప్రతిష్టాపన చేయబడింది.ఈ వేడుకలో ముధోల్ మాజీ శాసనసభ్యులు జీ. విఠల్ రెడ్డి పాల్గొని, మహాస్వామి వారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాసరలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత విస్తరించేందుకు ఇలాంటి ఆలయాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్ గౌడ్, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ రావు, సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి ఉత్తంభాలే రావు, మాజీ ఆత్మ చైర్మన్ పోతా రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అరుణ్, కీర్గుల్ బి. శ్రీనివాస్ రెడ్డి మరియు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు