మద్యం దుకాణాల దరఖాస్తులకు చివరి తేదీగా అక్టోబర్ 23 వరకు పొడిగింపు
జిల్లా ఎక్సైజ్ అధికారుల ప్రకటన
నిర్మల్, అక్టోబర్ 19:
నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాల లైసెన్సులకు ఈనెల 18వ తేదీ వరకు మొత్తం 942 దరఖాస్తులు అందాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ఎం. అబ్దుల్ రజాక్ గారు తెలిపారు.
అయితే అక్టోబర్ 18న రాష్ట్ర బంద్ జరగడంతో, దరఖాస్తుదారులకు బ్యాంకులు, రవాణా వంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో, దరఖాస్తుల గడువును అక్టోబర్ 23, 2025 వరకు పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్, హైదరాబాద్ వారు ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు.
దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లాటరీ ప్రక్రియ అక్టోబర్ 27, 2025న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
దరఖాస్తు వివరాలు:
ప్రతి దరఖాస్తుతో పాటు:
ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ప్రతులు
మూడు కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
రూ. 3,00,000/- నాన్ రిఫండబుల్ ఫీజు (డిమాండ్ డ్రాఫ్ట్ / చలాన్ రూపంలో)
ఫీజు చెల్లింపు:
డి.డి లేదా చలాన్‌ను కింది పేర్లలో ఏదైనా ఒకదానిపై తీయవచ్చు:
1. District Prohibition and Excise Officer, Nirmal
2. Commissioner Prohibition and Excise, Telangana, Hyderabad
దరఖాస్తు ఫారాలు మరియు దాఖలు చేయాల్సిన స్థలం:
జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి కార్యాలయం,
2వ అంతస్తు, రూమ్ నం.13, IDOC, కలెక్టరేట్, నిర్మల్.
గెజిట్ సీరియల్ నంబర్లు 1 నుంచి 47 వరకు ఉన్న దుకాణాలకు సంబంధించి, 01.12.2023 నుంచి 30.09.2025 మధ్య జరిగిన విక్రయాల వివరాలను ఎక్సైజ్ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై ప్రదర్శించారని తెలిపారు.
WhatsApp ద్వారా వివరాలు కావలసిన వారు, అధికారులని సంప్రదించాలని సూచించారు.
దరఖాస్తుదారులకు సూచనలు:
ఒక వ్యక్తి ఏ మద్యం షాపులకైనా, ఎన్ని దరఖాస్తులైనా వేయొచ్చు.
దరఖాస్తులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
గడువు లోపు దాఖలు చేసిన దరఖాస్తులే చెల్లుబాటు అవుతాయి.
అధిక సమాచారం కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్:
📞 శ్రీ ఎం. అబ్దుల్ రజాక్
Excise Superintendent, DP&EO, Nirmal
📱: 87126 58774
—