*జీవితం ఒక నాటకం*
జీవితం ఒక నాటకం
పాత్రలు పోషించాలి
భాద్యతలు బంధాలు
అనుబంధాలు సాగించాలి
జీవితం సంఘర్షణల మయం
సవాళ్లు ప్రతిసవాళ్లు సమస్యల
చక్రభంథంలో చిక్కుకొని సుఖ
దుఃఖాలను అనుభవించాలి
జీవితం ఒక రంగుల రాట్నం
ఆకాశంలో మబ్బులు సహజం
జీవితంలో ఆశ నిరాశలు సహజం
ఆశ నిరాశల దాగుడు మూతల
అటే లే ఈ జీవితం
జీవితంలో గెలుపు ఓటములు
జీవితం లో పాఠాలు గుణ పాఠాలు
ఓపిక ఓదార్పుకు రహదారులు కావాలి
జీవితం చేదు తీపి జ్ఞాపకాల మయం
జీవితంలో బాల్యం యవ్వనం
వృద్ధాప్యం మరువలేని మరిచిపోని
సంఘటనల సమాహారం
జీవితం అవమానాల అనుభవాల
నిలయం
జననం మరణం మధ్యన జీవితం
కీర్తి అపకిర్తి సంఘటనలతో జ్ఞాపకాల
మాల జీవితం
ఒక వైపు జన్మదిన వేడుకలు
జరుగుతుంటె
మరో వైపు మరణం వస్తుందన్న
భయంతో జీవితాన్ని గడిపే
విచిత్ర స్థితి దాపురించింది
జీవితంలో గతం,అంతా ఘనం
వర్తమానం అంతా సమస్యల
మయం సంక్షోభాలకు నిలయం
భవిష్యత్ అంతా అనిశ్ఛితి
సమాజంలో మంచిని పెంచు
ఇతరుల మెప్పును ఆశించకు
భావి జీవిత భాగ్యానికి
నీవే సారథి కావాలి
ఉజ్వల భవిష్యత్తు జీవితానికి
“ఆశ “అనే వెలుగును ఇవ్వాలి
ప్రగతిశీల సమాజ నిర్మాణమే
నీ కర్తవ్యం కావాలి,
అంతరాలు ఎరుగని సామాజిక
సమరసతను స్వాగతిధ్దాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు
తెలంగాణ ఎకనామిక్ ఫోరం
కరీంనగర్9440245771