భీమారం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.

భీమారం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.

భీమారం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

భీమారం మండల కేంద్రంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని బీసీ కుల సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భీమారం బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక అవడం ఎక్స్ రోడ్ నుండి బోయవాడ మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీని నిర్వహించారు. అనంతరం బస్టాండులో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్ని కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ బీసీలకు న్యాయబద్ధంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ రిజర్వేషన్లు ఆమోదించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి కుల సంఘాల నాయకులు, లంబాడ హక్కుల పోరాట సమితి నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు, నేతకానీ సంఘం నాయకులు, నాయకపోడ్ సంఘం నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment