.సారంగాపూర్‌లో బీసీ బంద్‌కు బీజేపీ మద్దతు

సారంగాపూర్‌లో బీసీ బంద్‌కు బీజేపీ మద్దతు

సారంగాపూర్‌లో బీసీ బంద్‌కు బీజేపీ మద్దతు

  • బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బంద్

  • సారంగాపూర్ మండలంలో బంద్ విజయవంతం

  • బీసీల రిజర్వేషన్ డిమాండ్‌కు బీజేపీ పూర్తి మద్దతు

  • మండల అధ్యక్షులు కాల్వ నరేష్ నేతృత్వంలో బంద్‌లో పాల్గొన్న నాయకులు



బీసీ రిజర్వేషన్ కోసం బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌కు సారంగాపూర్ మండలంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. మండలంలోని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్చంధంగా మూసివేయగా, బంద్ విజయవంతమైంది. మండల బీజేపీ అధ్యక్షులు కాల్వ నరేష్ నాయకత్వంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.



సారంగాపూర్ మండలంలో శనివారం బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీల రిజర్వేషన్ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బంద్‌కు విస్తృత స్పందన లభించింది. ఈ బంద్‌కు భారతీయ జనతా పార్టీ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించింది.

మండలంలోని అన్ని వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూసివేయడంతో బంద్ విజయవంతంగా కొనసాగింది.

ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు కాల్వ నరేష్, సీనియర్ నాయకులు సాహెబ్ రావు, విలాస్, భీమలింగం, లక్ష్మణ్, శేఖర్, రాజలింగం, నరసయ్య తదితరులు పాల్గొని బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

బీసీ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా నిలవాలని, ప్రభుత్వం త్వరగా రిజర్వేషన్లను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

  •  

 

Join WhatsApp

Join Now

Leave a Comment