ప్రతి కానిస్టేబుల్‌కి ఆత్మరక్షణ కోసం రైఫిల్ ఇవ్వాలి – జిల్లా మానవహక్కుల అధ్యక్షులు నర్సింగ్ రావు

ప్రతి కానిస్టేబుల్‌కి ఆత్మరక్షణ కోసం రైఫిల్ ఇవ్వాలి – జిల్లా మానవహక్కుల అధ్యక్షులు నర్సింగ్ రావు

 

  • కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్యపై తీవ్ర ఆందోళన

  • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి

  • ప్రతి కానిస్టేబుల్‌కి రైఫిల్ ఇవ్వాలన్న డిమాండ్

  • ప్రమోద్ కుటుంబానికి ఐదు కోట్లు పరిహారం, ఉద్యోగం ఇవ్వాలన్న అభ్యర్థన

  • ప్రతి కానిస్టేబుల్‌కి ఆత్మరక్షణ కోసం రైఫిల్ ఇవ్వాలి – జిల్లా మానవహక్కుల అధ్యక్షులు నర్సింగ్ రావు



నిజామాబాద్ జిల్లా సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్యపై జిల్లా మానవహక్కుల సాంస్కృతిక సామాజిక సంస్థ అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రతి పోలీస్ కానిస్టేబుల్‌కు రైఫిల్ ఇవ్వాలని, ప్రమోద్ కుటుంబానికి ఐదు కోట్లు పరిహారం, డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.



నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డ్యూటీ సమయంలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌పై నిందితుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా మానవహక్కుల సాంస్కృతిక సామాజిక సంస్థ జిల్లా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు నర్సింగ్ రావు.

ఈ దారుణ ఘటనకు బాధ్యుడైన నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, ఐపీఎస్ అధికారి సజ్జనర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలీస్ కానిస్టేబుల్‌కు ఆత్మరక్షణ కోసం రైఫిల్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఇలాంటి పద్ధతి అమలులో ఉందని గుర్తు చేశారు. ప్రమాద సమయంలో రైఫిల్ ఉంటే పోలీస్ ప్రాణాలు రక్షించుకోవచ్చని పేర్కొన్నారు.

అలాగే ప్రమోద్ కుటుంబానికి ఐదు కోట్ల రూపాయల పరిహారం, కుటుంబ సభ్యుల్లో ఒకరికి డీఎస్పీ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

నిందితుడిని వెంటనే పట్టుకోకపోతే సమాజంలో పోలీస్ శాఖ పట్ల చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.

ఈ సందర్భంగా ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment