మనతోనే ఉన్నట్లు
మనిషి జీవితం జననంతో
మొదలౌతుంది వివిధ దశల్లో
పలు సమస్యలు ఎదుర్కొని
వైఫల్యాలు విజయాలు
సాధించే క్రమంలో
మృత్యువాత పడతాఢు
ఆత్మీయులను కోల్పోతే
మనకు జీవితం
శూన్యం అనిపిస్తుంది
నిరాశ నిస్పృహలు
మనసును కమ్మి
బతుకు శూన్యం
అనిపిస్తుంది
మరణించిన వారి
ఆత్మశాంతి కోసమైన
మనం కోలుకోవాలి
వారి ఆశయాల సాధనే
వారికి మనం చెల్లించే
నీజమైన శ్రద్ధాంజలి
కావాలి వారి వారసత్వాన్ని కొనసాగిస్తేమరణించినప్పటి
వారి ఆలోచనలు సమాజాన్ని
ప్రభావితం చేస్తూనే ఉంటాయి
వారు జీవితంలో మిగిల్చిన
పనులు పూర్తి చేయడమే
మన జీవిత ధ్యేయం కావాలి
వారు ఏర్పరిచిన ఆశయాలు
లక్ష్యాల సాధనకు చేసిన కృషిని కొనసాగించడానికి
మనం ముందడుగు వేసే శక్తి
యుక్తులను సమకూర్చుకోవాలి
అప్పుడువారువెళ్లిపోయినట్లు
ఉండదు వారి ఆశయాల సాధనకైతగుకార్యాచరణకు
మనం ఉపక్రమించాలి
అప్పుడు వారు మనలను
విడిచి వెళ్ళారన్నభావనరాదు
కుటుంబంలో పెద్దలు
మహానుభావుల చరిత్ర
సమాజ అభివృద్ధిలో
వారు నిర్వహించిన పాత్ర
పాటించిన విలువలు ఆదర్శాలు
లక్ష్యసాధనకు వారు చేసిన
కృషిని చిన్న పిల్లలకు కథల
ద్వారా వివరించాలి.
స్వామి వివేకానంద
డాక్టర్ అంబేడ్కర్
అబ్దుల్ కలాం
జ్యోతిరావు పూలే
కాన్షీరాం అటల్ బిహారీ
వాజ్పేయి ఇందిరాగాంధీ
వరకవి సిద్ధప్ప’రవీంద్రనాథ్
ఠాకూర్ ‘కర్పూరిఠాకూర్
జస్టిస్ ఎన్’ కుమారయ్య
ఎన్టీ’రామారావు
కొండా లక్ష్మణ్ బాపూజీ
పీ’వీ సావిత్రి బాయి
పూలే సుష్మాస్వరాజ్
లోకనాయక్ జేపీ
తిలక్ భగత్ సింగ్
మహనీయుల త్యాగాలు
యువతరానికి అందించాలి
మానవ జీవితం ఒక నాటకం
సుఖ దుఃఖాలకు నిలయం
మానవ జీవితంలో
జననం మరణం సహజం
అనే తాత్వికతను పెంచాలి
బతికుండగానే ఆశ కొరకు
కాకుండా ఉన్నత ఆశయాల
కోసం జీవించాలి
జనం కోసం జీవిస్తే
చరిత్రలో చిరస్మరణీయులం
అవుతాం యువతకు
స్పూర్తిదాతలమౌదాం
నేదునూరి కనకయ్య
అధ్యక్షులు తెలంగాణ
ఎకనామిక్ ఫోరం
9440245771