కుమ్మర్లకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలి
“మానవ నాగరికతకు కుమ్మరి తొలి మెట్టు ఆరోగ్యానికి కుండ ఆయువు పట్టు”
మానవుడికి వంట నేర్పి మానవ జాతి చరిత్ర నిర్ధారణకు సంస్కృతి’ వారసత్వ విశేషాల అధ్యయనానికి దోహదపడే కుమ్మర వృత్తి అంతరించే దశకు చేరుకుంది. మానవాళికి వంట వండటానికి వంట పాత్రలు సమకూర్చి మానవ జాతికి శాస్త్రీయ పరిజ్ఞానం అందించి ప్రజారోగ్యాన్ని పర్యావరణ పరిరక్షణకు ప్రతినిధిగా నిలిచిన కుమ్మర వృత్తి కార్మికులు ఉపాధిలేక దుర్భరమైన జీవితాలను వెళ్ళ దీస్తున్నారు.
మానవ మనుగడ కుమ్మర వృత్తి మనిషి పుట్టుక ‘పెళ్లి’
‘చావు’ .’దైవ’ కార్యక్రమాల్లో కుమ్మర్ల ఉత్పతులు కుండలు’ గురుగులు’ వంట కొరకు ఎసులలు ‘అటికెలు నీటి నిల్వకు తొట్టీలు రంజన్లు’ కఢువలు పెళ్ళిళ్ళలో “ఐరేని కుండలు” వినియోగిస్తారు. కుమ్మర్లవృత్తి మానవ జాతి మనుగడలో ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో అతిశయోక్తిలేదు. చారిత్రక వాస్తవం “మొహంజదారో’ “హరప్పా” “మసపుటోనియా'” “సింథూ”
నాగరికత అధ్యయనాలలో వెల్లడైంది. గృహ ప్రవేశం ప్రభుత్వ భవనాల భూమి పూజ ‘అమ్మవారికి సమర్పించే భోనాలు’ తెలంగాణ సంస్కృతిని చాటే గోల్కొండ బోనాలు”శుభ” “దైవ”కార్యక్రమాల్లో కుమ్మరి కుండలు ఉపయోగిస్తారు. మట్టిని నమ్ముకొని పర్యావరణ పరిరక్షణకు కవచంగా నిలిచిన కుమ్మర వృత్తి ఉనికిని కోల్పోయే స్థితిలో వుంది.
కుమ్మర్లు కేంద్ర’ రాష్ట్ర ప్రభుత్వాల నిరాదరణకు గురై కుల వృతుల( మట్టి పాత్రలకు) ఉత్పతులకు గిరాకీ తగ్గటం వల్ల కుమ్మర వృత్తి పై ఆధారపడిన కుమ్మర్లు వృత్తిని వదిలి పట్టణాలకు వలస పోతున్నారు. అల్పవేతనాలకు పనిచేస్తూ శ్రమ దోపిడీకి గురౌతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 లక్షల జనాభా కలిగి 8 లక్షల ఓటర్లు ఉన్న కుమ్మర్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మధ్ధత్తు ఇచ్చారు. కుమ్మర్లు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధనలో తెగించి కొట్లాడారు. సకల జనుల సమ్మె ‘ మిలియన్ మార్చ్ లో కుమ్మర్లు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు. చాలా మంది కుమ్మర్లు గ్రామ ‘మండల జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో సేవలు అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను క్షేత్ర స్థాయిలో ప్రజలవద్దకు చేర్చి పార్టీ పట్ల ప్రజల విశ్వాసాన్ని సమీకరించడంలో గణనీయమైన కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 సంవత్సరాలు గడిచినా గత ప్రభుత్వం కుమ్మర్లకు చట్టసభల్లో నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలైనప్పటికీ కుమ్మర కులస్థులు చట్ట సభల్లో నేటికి ప్రవేశించలేదు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో చట్ట సభల్లో ప్రవేశం లేని కులాలకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్న రాష్ట్ర ముఖ్య మంత్రి ఎ’ రేవంత రెడ్డి హామీతో కుమ్మర్లు కోటి ఆశలు పెట్టుకున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేళ్లు ఐనప్పటికీ ఏఒక్క రాజకీయ పార్టీ అసెంబ్లీ ‘ లోకసభకు పోటీ చేయడానికి కుమ్మర్లకు టిక్కెట్లు ఇవ్వక పోవడం వల్ల కుమ్మర్లకు చట్ట సభల్లో ప్రవేశం లభించలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేఆర్థిక స్థోమత లేని నామినేటెడ్ పదవుల్లో కుమ్మర్లకు రాజకీయ పార్టీలు అవకాశం కల్పించక పోవడం వల్ల రాజ్యాధికారం లోవాటా కుమ్మర్లకు దక్కలేదు. కుమ్మర్లను బీ ‘సీ “బి” జాబితాలోచేర్చినప్పటికీ ఆశించిన విధంగా కుమ్మర్ల సామాజిక ‘ఆర్థిక ‘రాజకీయ వికాసం జరుగలేదు. నేటి వరకు కుమ్మర్లకు రాష్ట్రం నుండి అసెంబ్లీ ‘లోకసభ ‘రాజ్యసభ’ కౌన్సిల్ సభ్యులుగా ఒక్కరికి కూడా అవకాశం రాలేదు.
ఉత్తరాది రాష్ట్రాల్లో కుమ్మర్లను ప్రజాపతి ‘కుమార్ ‘కుంభార్ ‘ కుమావత్ ‘ కుంభాకార్ అనే పేర్లతో పిలుస్తారు.ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే చట్టం ఒకే రిజర్వేషన్ అంటూ చెబుతున్న నాయకులకు ఉత్తర’ దక్షిణ ‘భారత దేశ ప్రాంతాల మధ్య వివక్ష చూపడం వల్ల ప్రభుత్వాలు పార్టీలు అవలంబిస్తున్న దంద్వ వైఖరి వల్ల తెలుగు రాష్ట్రాలలో ఉన్న కుమ్మర్లు చట్ట సభల్లో ప్రవేశానికి నోచుకోలేదు.కుమ్మర్లను “ఎమ్మెల్సీ” ‘కార్పొరేషన్స్ కు ఛైర్మెన్ పదవుల్లో నామినేట్ చేయక పోవడం వల్ల రాజ్యాధికారం కుమ్మర్లకు అందని ద్రాక్ష అయ్యింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన మిషన్ కాకతీయ వల్ల చెరువుల్లో’ ‘కుంటల్లో మట్టి తవ్వకం వల్ల కుండలు చేయడానికి ఉపయోగించే బంక మట్టి కొరత ఏర్పడింది. మట్టి లభించే చెరువులు’ కుంటలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాల్లోకి వెళ్ళటం వల్ల ఉచితంగా లభించే మట్టికి డబ్బులు చెల్లంచే పరిస్థితి వచ్చింది. కుంటల్లో చెరువుల్లో కుమ్మర్లకు ఉచితంగా మట్టి లభించే ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కాలేదు.కుమ్మర వృత్తికి ముడిసరుకు మట్టి కలప లభించని పరిస్థితులు దాపురించాయి.ఈ పరిస్థితి కుమ్మర వృత్తిదారులు కుల వృత్తిని వదిలి పట్టణాలకు నగరాలకు వలసకు దారితీసింది . ఉపాధి కొరకు గుల్ఫ్ దేశాలకు వలస వెళ్లారు.
ప్లాస్టిక్ ‘అల్యూమినియం పాత్రలు మార్కెట్లో లభించడం వల్ల కుండలకు వంట చేసుకునే మట్టి పాత్రలకు డిమాండ్ తగ్గింది. కుమ్మర్ల రెండు రకాలుగా నష్టపోయారు.
కుండలు ‘వంట పాత్రలకు కావలసిన ముడి సరుకు మట్టి కొరత ఒక వైపు మార్కెట్లో గిరాకీ తగ్గడం మరో వైపు సమస్యలుగా పరిణమించి కుమ్మర వృత్తి కుదేలైంది. “కులవృత్తిని మించింది లేదు గువ్వల చెన్న” అన్న నానుడి కుల వృత్తిని వదిలిందే మిన్న అనేది నేడు విథానమైంది.
ఉత్తరాది రాష్ట్రాల్లో కుమ్మర్లు ఎ’ఎస్సీ ఎస్ ‘టి జాబితాలో వుండడం వల్ల అనేక రాజకీయ అవకాశాలు వచ్చాయి.అనేక మంది కుమ్మర్లు శాసన సభ్యులుగా ఎం’పి ‘లుగా ‘శాసన మండలి సభ్యులుగా ‘మంత్రులుగా తమ ప్రతిభను చాటుతున్నారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు చట్ట సభల్లో అవకాశం రాలేదు. ఐ ‘ఎ ‘ఎస్ ‘ఐ’పి’ ఎస్ అధికారులుగా అవకాశం రావడం లేదు. తెలంగాణ ఉద్యమంలో కుమ్మర్లు తమ “సారే “కుల వృత్తులు ప్రదర్శిస్తూ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు.అరెస్ట్ అయ్యిలాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెల్లారు.
తెలంగాణ ఏర్పడి 10 యేళ్లు ఐనప్పటికీ కుమ్మర కులస్థులకు చట్టసభల్లో ప్రవేశం లభించలేదు. రాష్ట్రంలోని119 నియోజక వర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థుల గెలుపు ఓటములు నిర్ణయించడంలో గణనీయమైన ఓటు బ్యాంకు వున్న కుమ్మర్లు నామినేటెడ్ పదవుల్లో నియమించ బడలేదు. తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి శ్రీ’ కె చంద్రశేఖర్ రావు చట్ట సభల్లో ప్రవేశం ప్రాతినిధ్యం లేని కులమైన కుమ్మర్లకు “ఎమ్మెల్సీ ‘పదవికి నామినేట్ చేస్తానన్న హామీ నేటికీ నెరవేరలేదు.
తెలంగాణలో కాంగ్రెస్ అద్వర్ర్యంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం ఇతర కుల వృత్తులకు ఆదుకున్నట్లే కుమ్మరవృత్తి దారులను ఆదుకోవాలి. కుమ్మర్ల సంక్షేమ చర్ర్యలు చేపట్టాలి.
కుమ్మర వృత్తికి ఆధునిక సాంకేతికతను అందించాలి.
యువతలో నైపుణ్యాభివృద్ధి కిపెద్ద పీట వేయాలి.ప్రతి మండల జిల్లా కేంద్రంలో అధునాతన పాటరీ కలంకారీ
ఉత్పత్తి కేంద్రాలను “స్కిల్ డెవలప్మెంట్ “ప్రోగ్రాం ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
కుమ్మర వృత్తి అభివృద్ధికి మౌలిక వసతులు “వాము” బట్టిల కొరకు ఉచితంగా స్థలం సమకూర్చాలి.మట్టి సేకరణ వాము కాల్చడానికి పోరుక అడవినుండి కలప
ఉచితంగా పొందడానికి ప్రభుత్వం జారీ చేసిన “జీ’వో” లు అమలు చెయ్యాలి.వాము’ కొరకు కుండల’ బట్టి కొరకు ‘షేడ్ కొరకు ప్రభుత్వం ఉచితంగా భూమి కేటాయించాలి.
ప్రభుత్వం విధించే “సీవరేజ్ సేస్ “వృత్తి పన్ను నుండి కుమ్మర వృత్తిని మినాహాయించాలి.
చాకలి ‘మంగలి వృత్తులకు ఇస్తున్న “ఉచిత విద్యుత్తు” సౌకర్యం కుమ్మర్లు ఉపయోగించే “సారే” కు వర్తింప చేయాలి. కుమ్మర్లకు గ్రామ పంచాయతీ ‘మున్సిపాలిటీ’ మున్సిపల్ కార్పొరేషన్లలో షాపింగ్ కాంప్లెక్స్ ల్లో వసతి ఉచితంగా కల్పించాలి. కుమ్మర్ల ఉత్పత్తులకు “రైతు బజార్లలో” స్టోరేజ్ సౌకర్యం మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. పాటరీ కోర్స్ ను విశ్వ విద్యాలయాలలో పాఠ్యాంశంగా చేర్చాలి. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
కేంద్ర ప్రభుత్వ భవిష్య నిధి పథకం ఇన్సూరెన్స్ ఆరోగ్యబీమా ప్రమాద బీమా సౌకర్యం కార్మిక మంత్రిత్వ శాఖ కుమ్మర వృత్తి దారులకు లేబర్ గుర్తింపు కార్డులు ఆరోగ్య కార్డులు ఉచితంగా ఇవ్వాలి.ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ ద్వార
గ్రామదేవాలయలలో( పోచమ్మ ‘మైసమ్మ’ గ్రామ దేవతలు) కుమ్మర కులస్తులను పూజారులుగా నియమిస్తూ జీ ‘వో.జారీ చెయ్యాలి.కుమ్మర వృత్తిదారులు పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కుమ్మర వృత్తి దారులకు ఉచితంగా విద్యుత్తుతో నడిచే సారి( ఆదునిక పరికరం) ఇవ్వాలి.
రాష్ట్ర ప్రభుత్వం కుమ్మర్ల సమగ్రాభివృధ్దికి ఆర్థిక వికాసానికి వృత్తి నైపుణ్య అభివృధి దోహదపడే “కుమ్మర / శాలివాహన ఫైనాన్స్ ఫెడరేషన్ కు రూ” “2000 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. కుమ్మర ఫైనాన్స్ ఫెడరేషన్ ను పునరుద్ధరించి ఫెడరేషన్ కు ఛైర్మెన్’ మరియు అన్నిజిల్లాకు ప్రాతినిధ్యం ఇస్తు పాలక వర్గాన్ని నియమించి కుమ్మర్లలో ‘ఆత్మ గౌరవాన్ని” పెంపొందించాలి. కుమ్మర్ల సమస్యల పరిష్కారంకోసం కుమ్మర్లలో నాయకత్వాన్ని ప్రోత్సహించే వాతావరణం
కల్పించే చర్యలు తీసుకోవాలి.కుమ్మర్లకు కార్పొరేషన్ పదవుల్లో నామినేట్ చేసి రాజ్యాధికారంలో భాగ స్వాములను చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ’ ఎ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయనైనది.
నేదునూరి కనకయ్య
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
హైదరాబాద్
కొల్లూరి అనిల్ కుమార్
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ కుమ్మర సంఘం 880/2014
హైదరాబాద్
9440245771